Skip to main content

Telugu News Power

ప్రజలపై అప్పుల భారం మోపని కూటమి ప్రభుత్వం మంత్రి నిమ్మల

కనకదుర్గ ఆలయ కమిటీ చే ప్రమాణస్వీకారం చేయిస్తున్న మంత్రి నిమ్మల

లకొల్లు:డిసెంబర్, 6 (తెలుగు న్యూస్ పవర్)అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయం స్వార్థం కోసం కాదు,ప్రజల కోసం అని నమ్మే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీరికి అండగా ప్రధాని మోడీ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అప్పుల భారం లేని అభివృద్ధి,సంక్షేమ రాజ్యం నడుస్తున్నదని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి పాలన 15 ఏళ్ల పాటు సాగాలని ఉపముఖ్యమంత్రి కూటమి నేతలకు దిశానిర్దేశం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నప్పుడు గాని, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గానీ తాను ఎంతగానో అభిమానిస్తానని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా జనసేన జిల్లా నాయకులు తులా రామలింగేశ్వర రావు చే అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం మంత్రి రామానాయుడు చేయించారు. అనంతరం దేవస్థానం ధర్మకర్తలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా తులా రామలింగేశ్వరరావు పలురు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన నాయకులు సినీ నిర్మాత బన్నీ వాసు,జిల్లా జనసేన అధ్యక్షులు కోటికలపూడి గోవింద రావు, చిన్న, బిజెపి నాయకులు,కపర్ది, కర్నేని గౌరు నాయుడు దంపతులు, పొట్నూరి శ్రీనివాస్, జానీ, జీవి, పెచ్చటి బాబు. తదితరులు పాల్గొన్నారు.