ముంబై: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్ . కామ్)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మక “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ది ఎకనామిక్ టైమ్,ఈ అవార్డును ముంబై లో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు.
పారిశ్రామిక రంగంలో సంస్కరణలకు గుర్తింపు
రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళీకరించడం వంటి అంశాల్లో సీఎం చంద్రబాబు నాయకత్వం కీలకంగా నిలిచిందని జ్యూరీ అభిప్రాయపడింది. సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను బలోపేతం చేయడం,
పెట్టుబడిదారులకు పారదర్శక విధానాలు అమలు చేయడం,
ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడం, స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ప్రోత్సాహం ఇవ్వడం
భారీ పెట్టుబడుల ఆకర్షణ వల్ల
గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశీయ, విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నాయి. వివిధ అంతర్జాతీయ సమ్మేళనాలు, ఇన్వెస్టర్ మీట్స్ ద్వారా రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది.
విశాఖపట్నం, అమరావతి, తూర్పు తీర ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పారదర్శక పాలన , అభివృద్ధికి పునాది వేసింది.సాంకేతికత ఆధారిత పాలన, డిజిటల్ సేవలు, రియల్ టైమ్ మానిటరింగ్ వంటి విధానాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సీఎం ఈ సందర్భంగా, స్పందిస్తూ,
ఈ అవార్డు రాష్ట్ర ప్రజలందరికీ చెందుతుందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. “ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఉత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడం లక్ష్యంగా పేర్కొన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తాం” అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశంలోని దిగ్గజ వ్యాపార, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.