Skip to main content

Telugu News Power

బ్యాంకును మోసగించిన మేజర్. రూ. 1.49 కోట్ల బ్యాంకు సొమ్ముతో బెట్టింగ్.

మెదక్: మే,13(తెలుగు న్యూస్ పేపర్. కామ్) బెట్టింగ్ వ్యసనానికి బానిసలై ఎందరో తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఈసారి, మెదక్ జిల్లా అర్బన్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అనిల్ బెట్టింగ్ అడగటం కోసం బ్యాంకును మోసగించారు. భార్య, స్నేహితుల పేర్ల మీద 16 బ్యాంకు ఖాతాలు సృష్టించారు. ఈ ఖాతాల ద్వారా రూ.1.49 కోట్ల రుణాలు తీసుకున్నాడు. బంగారం పై తీసుకున్న ఈ రుణానికి గాను వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు బ్యాంకులో కుదువ పెట్టి బ్యాంకు సొమ్మును తప్పుదారి పట్టించారు. బ్యాంకు ఏటీఎంలో నగదు పెట్టే సమయంలో రూ.31.35 లక్షలు దారి మళ్లించినట్టు విచారణలో గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మేనేజర్ అనిల్ భార్య, అతని స్నేహితులను అరెస్టు చేశారు. అసలు నిందితుడు పరారీ లో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపు తీవ్రతరం చేశారు.