యలమంచిలి: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) మట్లపాలెం హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న అంబటి జయశ్రీ యుటిఎఫ్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించింది. ఆనాడే ఆమె ప్రతిభ కనబరిచింది. ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను592 మార్కులు సాధించింది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుంది. తెలుగులో 99, ఆంగ్లంలో 98, హిందీలో 95 మార్కులు వచ్చాయి. మండలంలో ఉన్న 11 ఉన్నత పాఠశాలల్లో ప్రథమరాలిగా నిలిచింది. ఇంకా వివరాలు అందిన తరువాత జిల్లా, రాష్ట్రస్థాయి స్థానం స్పష్టం అవుతుంది. మండల యూటీఎఫ్ శాఖ జయశ్రీకి శుభాకాంక్షలు తెలియజేసింది.అంబటి జయశ్రీ తండ్రి వ్యవసాయకూలి, తల్లి కట్టుపాలెం యూపీ పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం సహాయకులుగా పని చేస్తున్నారు. జయశ్రీ, రోజు కట్టుపాలెం నుంచి మట్లపాలెం ఉన్నత పాఠశాలకు వెళ్లి వచ్చేది.ఈమె 8వ తరగతి వరకు కట్టుపాలెం యూపి స్కూల్లో చదువుకుంది. ఈమె చదువు అంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. కుమార్తెను, చక్కగా చదివించినందుకు తల్లిదండ్రులను పలువురు అభినందించారు. ఈ మట్టిలో మాణిక్యానికి, ఐఐటి చదవాలనే లక్ష్యం ఉన్నట్టు తెలిపింది.
పదో తరగతి ఫలితాల్లో జేయశ్రీ జయకేతనం.
మండల ప్రధమ సాధించిన అంబటి జయశ్రీ