Skip to main content

Telugu News Power

పట్టణంలో వార్డులు 44కు పెంపు. ముసాయిదా విడుదల, అభ్యంతరాలకు ఈనెల 14 వరకు గడువు. -కమిషనర్, దొడ్డా కిరణ్ కుమార్.

ముసాయిదా ప్రతిని విడుదల చేస్తున్న కమిషనర్, సిబ్బంది బృందం

పాలకొల్లు:అక్టోబర్,8( తెలుగు న్యూస్ పవర్. కామ్) అతి పురాతన మున్సిపాలిటీగా ప్రసిద్ధిగన్న పాలకొల్లు మున్సిపాలిటీ వార్డులు గతంలో ఉన్న 35 నుంచి 44 వార్డులకు పెరిగాయి. కమిషనర్, దొడ్డా కిరణ్ కుమార్ ముసాయిదా ప్రతిని గురువారం ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ప్రకటన ప్రతిని విడుదల చేశారు. మున్సిపాలిటీలో అడవి పాలెం, కొంతేరు, పాలకొల్లు రూరల్ పంచాయతీ, వరిధనం, ఉల్లంపర్రు కొంత, పూలపల్లి, భగ్గేశ్వరం గ్రామాలు పట్టణంలో విలీనం అయ్యాయి. గత ఎన్నికలు ఈ మున్సిపాలిటీలో జరగలేదు. వెళ్లిన గ్రామాలకు సంబంధించి కోర్టు కేసులు వల్ల సుమారు 7ఏళ్ళు గా ఈ పరిధిలో ఉన్న సానికి సంస్థలకు ఎన్నికలు జరగలేదు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో, కోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం ఎదురైన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని కేసులు కొట్టివేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా, విలీన గ్రామాలతో మహా పట్టణం ఏర్పడి పాలకొల్లు మునిసిపాలిటీ పరిధి విస్తరించి వందేళ్ళకు పైగా ఉన్న రూపురేఖలు మారిపోతున్నాయి. ఇందుకు సంబంధించి ఎవరైనా తొలి సూచనలు సలహాలు ఇవ్వటానికి, అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలియజేయటానికి ఈ నెల 14 వరకు గడువు ఉందని కమిషనర్ తెలిపారు. వార్డుల పునర్విభజన ముసాయిదా ప్రతి కావలసినవారికి మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.