Skip to main content

Telugu News Power

మంత్రి నిమ్మలతో గౌడ,శెట్టిబలిజ సోదరుల ఆత్మీయ సమావేశం.

ఆత్మీయసత్కార సమావేశంలో మంత్రి నిమ్మల

పాలకొల్లు: అక్టోబర్,18
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ను నియోజకవర్గ గౌడ, శెట్టిబలిజ సోదరులు, మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గానికే తలమాణికమైన, ప్రతిష్టాత్మక గౌడ, శెట్టిబలిజ సామాజిక భవనం నిర్మాణానికి, మంత్రి 3 విడతల్లో, రూ. 7.50 కోట్లు మంజూరు చేయించినందుకు, కృతజ్ఞతగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా, మంత్రి చేస్తున్న మంచి పనికి, ప్రతిపక్ష వైసిపి నాయకులు కూడా ఫిదా అయ్యారు. ప్రముఖ రాజకీయ నేపథ్యం ఉన్న యలమంచిలి మండలం, కాజ పడమర మాజీ సర్పంచ్, జడ్పిటిసి మాజీ సభ్యులు, గుబ్బల రామకృష్ణ సోదరులు, గుబ్బల వేణు ఈ సందర్భంగా, ఈసారి, నిమ్మలకు మద్దతు ఇస్తానని బహిరంగ ప్రకటన చేశారు. ప్రభుత్వ రాకపోయినా సొంత ఆస్తులు అమ్మి అయినా సామాజిక భవనం పూర్తి చేస్తానని మాట ఇచ్చిన మంత్రి తన వాగ్దానం నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గ అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరిస్తున్న, మంత్రికి సాలు అను కప్పి ఆత్మీయ సత్కారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, తన హ్యాట్రిక్ విజయంలో వెనుకబడిన వర్గాల మద్దతు ఎంతో ఉందన్నారు. వారి రుణం తీర్చుకోవడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కోడి విజయభాస్కర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, యలమంచిలి మండల టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, సర్పంచుల ఛాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపి, మహేష్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ సభ్యులు చినమిల్లి గణపతిరావు, అంగర చిన్న బొక్కా గంగాధర్, చిట్టూరి ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.