Skip to main content

Telugu News Power

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సువాసిని పూజ. శక్తి వేషాల ప్రదర్శన.

ఆలయం వద్ద శక్తి వేషాల ప్రదర్శన
సామూహిక సువాసిని పూజ

పాలకొల్లు: అక్టోబర్, 18,(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం ఉదయం, 108 మంది ముత్తైదువులకు దేవస్థానము, భక్తులైన దాతలు సహకారంతో సామూహిక సువాసిని పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.అభిషేక్ పండిట్ భమిడిపాటీ వెంకన్న, మద్దూరు సూరిబాబు, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, అర్చకులు వీరబాబు, సుబ్బయ్య, తదితరులు పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాణాధికారి రాపాక శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఆలయ లీలా కళ్యాణ మండపం లో సువాసిని పూజలు భక్తులకు అవసరమైన సౌకర్యాల ఏర్పాట్లు పర్యవేక్షించినారు. తదుపరి సువాసిని పూజలు చేసుకున్న భక్తులకు నిత్య అన్నదాన ప్రసాదములు భోజనాలు ఏర్పాటు చేసారు. ధర్మకర్తలు ఉప్పలపు దుర్గా పెద్దిరాజు, బాసిన సత్యనారాయణ, హోతా ప్రవాళ, కొండేటి సూరిబాబు, వందరపు కుమారి, నీలాపు సింహాచలం, నీలాపుమణి, ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఆలయ సిబ్బంది, పాల్గొన్నారు, వాలంటీర్స్ భక్తులకు తమ సేవలు అందించినారు. అశ్విశజ శుద్ధ అష్టమి, ఆదివారం రాత్రి శ్రీ కాళికాదేవి అలంకారము లో శ్రీ అమ్మవారు భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఆదివారం సాయంత్రం, బి. కొండేపాడు పేరిచర్ల రంగరాజు గ్రూపు కాళికాదేవి శక్తి వేషాలతో శ్రీ స్వామివారి మాడ వీధులు, దేవాలయ మండపాలలో గోపురం వద్ద శక్తి వేషాలతో ప్రదర్శన ఇచ్చారు.