Telugu News Power

కంటి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమ

కంటి అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎస్.ఎమ్. ప్రభుత్వ అటానమస్ కళాశాల నందు ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 1,2, హెల్త్ కేర్ సెంటర్, రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు పాలకొల్లు ఆర్.ఆర్. లయన్స్ ఐ హాస్పిటల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ‘డ్రై ఐ సిండ్రోమ్’ (కళ్లు ఆరిపోవడం) అనే అంశంపై మంగళవారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు నిరంతరం మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు గడపడం వల్ల కంటి సమస్యలు పెరిగిపోతున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి పి.లక్ష్మీపతి రాజు , ఆర్ఆర్ లైన్స్ ఐ హాస్పిటల్, పాలకొల్లు వారు కళ్లలో మంటలు, దురద, కళ్లు ఎర్రబడటం మరియు దృష్టి మసకబారడం వంటివి డ్రై ఐ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలను వివరించారు.కంప్యూటర్ వాడేటప్పుడు తరచుగా కళ్లు ఆర్పడం, ’20-20-20′ సూత్రాన్ని పాటించడం (ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడటం) ద్వారా కంటిపై ఒత్తిడి తగ్గించుకోవచ్చని తెలిపారు. హెల్త్ కేర్ సెంటర్ కన్వీనర్ డాక్టర్ ఎమ్ రామకృష్ణ కంటి సమస్యలు ఉన్నప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా, వెంటనే నిపుణులైన నేత్ర వైద్యులను సంప్రదించాలని సూచించారు.
డా. బి. వెంకట స్వామి, తెలుగు విభాగాధిపతి కంటి ఆరోగ్యం కోసం గంటల తరబడి స్క్రీన్ చూడకుండా మధ్యమధ్యలో విరామం తీసుకోవాలని, పోషకాహారం మరియు తగినంత నిద్ర అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ టి. కృష్ణ, ఐ క్యూ ఏ సి కోఆర్డినేటర్ కె. భద్రాచలం, డా. వి.డి.వి విజయలక్ష్మి, బి. కె. వి. రామలక్ష్మి, వి. శిరీష, కుమారి పి. జ్యోత్స్న శ్రీ,,కుమారి మాధురి,.శిరీష విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.