
పాలకొల్లు: ఆగస్టు, 2( తెలుగు న్యూస్ పవర్. కామ్)
నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము రేయింబవళ్ళు కష్టపడి పని చేస్తుంటే, అధికారులు తమ కష్టాన్ని మట్టిపాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్యక్షంగా వారం వారం నిర్వహించే అభివృద్ధి పనులు పరిశీలనలో భాగంగా ఆదివారం వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణంలో డంపింగ్ యార్డ్ నుంచి తరలించిన వ్యర్ధాలతో కూడిన మట్టని చూసి అధికారులపై ఆగ్రహంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం ఆవరంగులాల ఎత్తు వరకు మాత్రమే డంపింగ్ యార్డ్ లో శుద్ధిచేసిన మట్టి వాడాలని చెప్పినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల కన్నెర్రజేశారు. ఇంకా నల్ల మట్టి ఎర్ర మట్టి ఎక్కడ వేస్తారని ప్రశ్నించారు. సంబంధిత అధికారి పనులు పర్యవేక్షించకుండా, అటు నుంచి అటే, చుట్టపు చూపుగా చూసి వెళ్ళిపోతున్నట్టు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. చెత్తాచెదారం దుర్గంధంతో కూడిన ఈ మట్టి ఆసుపత్రి పరిసరాల్లో ఉండటం పట్ల మంత్రి తీవ్రంగా స్పందించారు. దక్షిణ అక్కడ నుంచి అబద్దాలను తొలగించాలని ఆదేశించారు. నరసాపురం ఆర్టీవో దాసిరాజుకు ఈ పనుల పర్యవేక్షణ అప్పగించారు. పనుల నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అధికారులు, గుత్తేదారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేయాలని హెచ్చరించారు. అంతకుముందు, మంత్రి
రూ 1.93 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ముస్లిం సాధిఖానా, మొదటి అంతస్తు, కేవలం పని వారి కోసం వేసుకున్న నిచ్చెన ఎక్కి పనులు పరిశీలించారు. ఈ సాహసం పట్ల నాయకులు ఆందోళనకు గురయ్యారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం రూ. 75 లక్షలతో నిర్మిస్తున్న పనులను మంత్రి పరిశీలించార. వంద పడకల ఆసుపత్రి వద్ద పరిస్థితి చూసి, మంత్రి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తాము ఎంతో కష్టపడి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తుంటే, అధికారులు మాత్రం నిమ్ముకు నీరెత్తిన తీరుగా ఉండటం పట్ల మంత్రి తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి సుందరీకరణ పనులు నాణ్యతతో, సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది, మహమ్మద్ జానీ, సురేష్ చిన్నమిల్లి గణపతి తదితర నాయకులు, మున్సిపల్ కమిషనర్, కిరణ్ కుమార్, ఆసుపత్రి సూపర్ ఇండెంట్ డాక్టర్, మాధురి, ప్రజారోగ్య శాఖ డి ఈ విజయ్ తదితర అధికారులు పాల్గొన్నారు.