యలమంచిలి, జూలై, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నదమ్ముల్లా ఐకమత్యంతో కలిసి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గ నాయకులు బోనం వెంకట నరసయ్య ( చిన బాబు) పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో హస్తకళాకారులకు గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హస్త కళాకారుల వైద్య ఆరోగ్య సమస్యలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని చినబాబు తెలిపారు. మండల తిరుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు మాట్లాడుతూ, మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. జనసేన ప్రచార కమిటీ నాయకులు, కనకదుర్గమ్మ దేవస్థానం అధ్యక్షులు, తులా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, మంత్రి నిమ్మల రామానాయుడు రాకపోయినప్పటికీ వైద్య శిబిరం నిర్వహించవలసిందిగా అనుమతి ఇచ్చారని, కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి పనిచేసేలా మంత్రి ప్రోత్సహిస్తున్నారన్నారు. స్థానిక సొసైటీ అధ్యక్షులు బొప్పన హరి కిషోర్ మాట్లాడుతూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జనసేన అధ్యక్షులు కొడవటి వరబాబు మాట్లాడుతూ హస్త కళల శాఖ అధికారి ప్రసాద్ కోరిన వెంటనే వైద్య శిబిరం నిర్వహణకు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి పరిసర గ్రామాల హస్తకళాకారులు విద్య సేవలు అమ్ముకున్నారు. కంటి పరీక్షలు అనంతరం అవసరం అయిన వారికి కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాజీ జడ్పిటిసి, బోనం నాని, నానిక ఎంపీటీసీ చిలుకూరి రాజ్యలక్ష్మి శ్రీనివాస్, స్థానిక వైద్యులు వారి సిబ్బంది ఈ శిబిరంలో సేవలు అందించారు.
యలమంచిలి లో హస్తకళాకారుల వైద్య శిబిరం.
ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్స వంలో మాట్లాడుతున్న బోనం చినబాబు