Skip to main content

Telugu News Power

రుతుక్రమంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి

పాలకొల్లు: మే, 29 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
రుతుక్రమ సమయాల్లో మహిళలు పరిశుభ్రత పాటించాలని జిల్లా అధికారిని దేవ సుధ సూచించారు. జాతీయ రుతు పరిశుభ్రత దినోత్సవం స్థానిక లంకలకోడేరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించారు. మహిళలు మూఢనమ్మకాలు వదిలేసి, రుతుక్రమంలో తప్పనిసరిగా పరిశుభ్రత పాటించవలసిన అవసరం ఉందని సుధ తెలిపారు. బహిష్టు సమయంలో నూలు దుస్తులు ధరించి, పాడ్స్ వాడటం వల్ల రోగాలు రాకుండా నిరోధించవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నవ్య జీవన్, వారి సిబ్బంది, డాక్టర్ కిషోర్, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.