Telugu News Power

వయసులో చిన్న, నటనలో మిన్న -బాలనటి త్రిష.

బాలనటి అవార్డు అందుకుంటున్న నటి త్రిష

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కాం)
వీపు మీద పుస్తకాల సంచి తగిలించుకోక ముందే ఆమె ఒంటిని చీర చుట్టుకుంది”. ఆ నాలుగేళ్ల చిన్నారి,చక్కని బీచ్ కలర్ చీర కట్టుకొని, భారతదేశంలోని అత్యంత గొప్ప వేదికపై ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. భయం,సంకోచం ఏ కోశానా లేదు. కేవలం నిశ్శబ్దమైన, ఘనీభవించిన హుందాతనం. ఆమె భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ బాలనటి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. ఆ ఒక్క క్షణంలో, ఆమె చరిత్రను శాశ్వతంగా తిరగరాసింది. ఆమె పేరు త్రీషా వివేక్ థోసర్. మరి ఆమె ఆరు దశాబ్దాలకు పైగా నిలిచి ఉన్న లెజెండరీ నటుడు కమలహాసన్ రికార్డును బద్దలు కొట్టింది. ఆమె మూడేళ్లకే నటించింది. నాలుగేళ్లకే ప్రతిష్టాత్మక అవార్డు గెలిచింది. మరాఠీ చిత్రం నాల్ 2లో త్రీషా చిమి అనే అమాయక పల్లెటూరి పిల్ల పాత్రలో నటించింది, ఆశ్చర్యంతో నిండిన పిల్ల. ఆమె నటించలేదు. ఆ పాత్రలో జీవించింది. చాలా మంది పిల్లలు అక్షరాలు నేర్చుకునే వయసులో, ఆమె సహజమైన, స్వచ్ఛమైన భావోద్వేగంతో జాతీయ జ్యూరీని కదిలించింది. ఆమె కమల్ హాసన్ 60 ఏళ్ల రికార్డును చెరిపేసింది. ఆ మహానటుడు స్వయంగా పబ్లిక్‌గా పోస్ట్ చేస్తూ,”నువ్వు నా రికార్డును బద్దలు కొట్టావు! నేను నా మొదటి అవార్డు అందుకున్నప్పుడు అప్పటి నాకు ఆరేళ్ల వయసు.” అన్ని ఆమెను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని నట శిఖరాలు చేరుకోవాలని ఆశిద్దాం.