Skip to main content

Telugu News Power

రైతుల మేలు కోరేది కూటమి ప్రభుత్వం. -మంత్రి నిమ్మల.

శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నిమ్మల

పాలకొల్లు: సెప్టెంబర్, 27
(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రం లో తీవ్ర ఎల్ నినో లో పరిస్థితుల్లో కూడా10.40 లక్షల ఎకరాల సార్వా సాగుకు సాగునీటి సరఫరా చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు
పేర్కొన్నారు. స్థానిక నాగరాజుపేట, వరిధనం గ్రామాల్లో రూ. 1. 98 కోట్లతో ఈ పట్టణంలో పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, మంత్రి మాట్లాడుతూ, రైతులు కష్టపడి పండించిన పంట సొమ్ము కోసం వైసీపీ ప్రభుత్వం ఏళ్ల తరబడి నరకం చూపించిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే, గంటల ఇది అవధిలో వారికి సొమ్ము చెల్లిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతులు తమ ధాన్యాన్ని ఇష్టమైన రైస్ మిల్లుకు అమ్ముకునే సౌకర్యం కల్పించిందన్నారు. రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్కు తరలించడానికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం పుంత రోడ్ల నిర్మాణం చేపట్టి రైతులకు మేలు చేస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగలా మార్చాలని, వీరంతా రూమ్ రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో, పాముల రజిని కుమార్, ఉన్నమట్ల కపర్ది, చెల్లెం ఆనంద ప్రకాష్, దొడ్డ ఏడుకొండలు, పోతుల సూరిబాబు, మాత రత్నంరాజు, కోణం కుమారి, అంబటి శేషగిరి, పోతుల సూరిబాబు, నిమ్మల నాగేశ్వరరావు, అంజిబాబు, లక్ష్మణ్, నాగేంద్ర, సుబ్బారావు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.