Skip to main content

Telugu News Power

బీసీలకు అన్యాయం జరిగింది జగన్ పాలనలోనే. వైసిపి పై ధ్వజమెత్తిన కూటమి బీసీ నాయకులు.

పత్రికా సమావేశంలో పాల్గొన్న బీసీ నాయకులు

పాలకొల్లు: సెప్టెంబర్,27(తెలుగు న్యూస్ పవర్. కామ్) బీసీలకు అన్యాయం జరిగింది జగన్ ప్రభుత్వ పాలనలోనేని కూటమి బీసీ నాయకులు వైసిపి పార్టీపై ధ్వజమెత్తారు. పలువురు బీసీ నాయకులు ఆదివారం స్థానికం గా జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. వైసిపి పార్టీ రాజమహేంద్రవరంలో నిర్వహించిన బీసీ గర్జన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, కూటమి ప్రభుత్వాన్ని నిరాధారమైన ఆరోపణలతో నిందించడానికి తీవ్రంగా ఖండించారు. బి సి ల సంక్షేమ, సాధికారితల కోసం టిడిపి పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. టిడిపి ప్రభుత్వం 1995 నుంచి బీసీలకు స్థానిక సంస్థలలో 34 శాతం రిజర్వేషన్లను తెచ్చిందన్నారు. ఈ రిజర్వేషన్ జగన్ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించినప్పుడు వైసిపి నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని విమర్శించారు. ఇందువల్ల వేలాదిమంది రాజకీయ అవకాశాలను కోల్పోయారని ఆరోపించారు. పదవిలో ఉన్నప్పుడు అన్యాయం చేసి, అధికారం కోల్పోయాక బీసీల పట్ల ముసలి కన్నీరు కార్చటాన్ని బీసీలు నామటానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, జిల్లా బీసీ నాయకులు కర్నేని గౌరు నాయుడు, మండల టిడిపి అధ్యక్షులు మామిడి శెట్టి పెద్దిరాజు, సర్పంచుల చాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపి, సొసైటీ మాది అధ్యక్షులు పాలవలస తులసిరావు, గుబ్బల ఏడుకొండలు అంగర వీరభద్ర కుమార్, సానబోయిన వెంకట శ్రీనివాస్, శీలం శ్రీనివాస్ ఈ సమావేశంలో మాట్లాడారు.