పాలకొల్లు: మే, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
దోపిడీ కోరల్లో చిక్కుకున్న రొయ్యల రైతులకు విముక్తి కలిగించడానికి వినూత్న పద్ధతులు అన్వేషిస్తున్నట్టు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా, శనివారం పత్రికా సమావేశంలో మాట్లాడారు. రొయ్యలకు స్థానిక మార్కెట్లో డిమాండ్ సృష్టించటానికి ప్రణాళిక అమలు చేయనున్నట్టు తెలిపారు. పట్టణ వార్డుల్లో, గ్రామాల్లో ఉన్న చిరు వ్యాపారులకు రొయ్యలు నిలవ చేసే ఫ్రిడ్జ్ లో నిలువ చేసుకొని, అమ్ముకునే విధంగా రూ. 10 వేల సరుకు అరువుగా ఇస్తామని పేర్కొన్నారు. వారికి ఈ వ్యాపారం లాభసాటిగా ఉంటుందన్నారు. ప్రజలకు కూడా రొయ్యల ధర అందుబాటులో ఉంటుందన్నారు. రొయ్యల రైతులు ఎకరానికి 60 వేల నెంబర్ మాత్రమే వేస్తే, సహజ పద్ధతిలో పండించడం వల్ల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని సూచించారు. ఇందువల్ల రైతుకు గిట్టుబాటు అవుతుందన్నారు. సరఫరా తగ్గి రొయ్యకు డిమాండ్ పెరుగుతుందన్నారు. నాణ్యమైన సీడ్ రాక, మేత రేట్లు పెరిగిపోయి, రొయ్యల ధర పడిపోయి రైతు, సిండికేట్ల పద్మ వ్యూహంలో చిక్కుకుని ఇక్కట్లు పడుతున్నారని, అందువల్ల, ఆక్వా ఉత్పత్తుల వినియోగించడం వల్ల బలవర్ధక మైన పోషకాహారం లభిస్తుందని ప్రజల్లో అవగాహన తీసుకువస్తాను అన్నారు. ఈ సందర్భంగా, జూన్, 8 మృగశిర కార్తి ప్రవేశం రోజున ప్రజలు విధిగా కిలో చేపలు, కేజీ రొయ్యలు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా సంఘం సౌజన్యంతో జూన్, 8న స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో, మంత్రి నిమ్మల రామానాయుడు చేతులు మీదుగా గోంగూర పచ్చి రొయ్యలు, చేపల పులుసుతో ఉదయం పూట పేదలకు ఉచిత భోజనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నరసాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గుమ్మడి నాయకరా ఆధ్వర్యంలో నర్సాపురం సెంటర్లోనూ, మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో మార్టేరు సెంటర్ లోనూ ఈ ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆక్వా సంఘ కన్వీనర్లతో, రైతుల సమస్యపై కార్యాచరణకు తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో, పెనమత్స సత్యనారాయణ రాజు, మేక ఫణీంద్ర ప్రసాద్, పడమట మావుళ్ళు, అందరూ వరప్రసాద్,మేడిది జాన్ డేవిడ్ రాజు, బోనం చినబాబు, పాల్గొన్నారు.
రొయ్యలు, చేపలతో జూన్, 8న పేదలకు ఉచిత భోజనాలు. -పాలకొల్లు ఆక్వా రైతు సంఘం.
రొయ్యల రైతుల సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు