Skip to main content

Telugu News Power

సాహితీ స్రష్ట ఆచార్య అప్పాజోస్యుల వారికి రసధుని సాహితీ పురస్కారం

అప్పాజోస్యులు వారిని సత్కరిస్తున్న రాసధుని బృందం
వేదికపై ఆసీనులైన సాహితీవేత్తలు

పాలకొల్లు: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక లయన్స్ క్లబ్ లో సాహితీ స్రష్ట ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ కు ప్రతిష్టాత్మక “పెద్దిభోట్ల బ్రహ్మయ్య స్మారక రసధుని సాహితీ పురస్కారం ఆదివారం ప్రదానం చేసారు. ఈ సభాకు యర్రంశెట్టి వెంకటరత్నం స్వాగతం పలికారు, కొట్టి భాస్కరరావు సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా,
మాట్లాడుతూ ఇప్పటి వరకు 22 మంది ప్రముఖ సాహితీ వేత్తలకు రసధుని సాహితీ పురస్కారాన్ని అందించి నట్టు తెలిపారు., ఈ అవార్డుకి అప్పాజోస్యుల సత్యనారాయణ ఇలాంటి వాగ్దేవి వరపుత్రులను సత్కరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.
. ముఖ్య అతిధులుగా హాజరైన ప్రముఖ సాహితీ వేత్త, విమర్శకులు, ప్రముఖ గజల్ రచయిత డా.రెంటాల శ్రీవేంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ
అజో -విభో -కందాళం ఫౌండేషన్ ద్వారా ఎందరో తెలుగు ప్రతిభావంతులను గుర్తించి, అభినందించి, పురస్కారాలతో ఘనంగా సన్మానించారనీ, కొత్త నాటకాలు వ్రాయించి, ముద్రించి, ప్రదర్శనలు చేయిస్తూ నాటకరంగ వికాసానికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. సాహితీ సుక్షేత్రంలో పుట్లకొంది సాహిత్యాన్ని పండిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, వేలాది గ్రంధాలు వెలువరిస్తున్నారని కీర్తించారు. ప్రముఖ కవి మధునాపంతుల సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, అప్పాజోస్యుల వారు ప్రకాశం జిల్లా చీరాలలో జన్మించి, అమెరికాలోని విస్కాన్సన్ యూనివర్సిటీలో, న్యూజెర్సీలోని స్టీవెన్స్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా, బోధనాచార్యుడిగా పనిచేసి, తన ప్రతిభా పాటవాలతో స్టీవెన్ యూనివర్సిటీ పాలకమండలిలో సభ్యుడిగా స్థానం పొందడం దేశానికి గర్వ కారణం అన్నారు. సంస్కృతాంధ్ర పండితులు కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ మాట్లాడుతూ, అప్పాజోస్యుల సత్యనారాయణ గారు దివాకరవృత్త తారావళి, పావకవృత్త తారావళి వంటి సప్తవృత్త తారావళులు అనే లఘుపద్య కృతులు, సుగుణాడ్య శతకం, మన చాటుపద్య సంపద, ఆపరోక్షానుభూతి పద్యానువాదం వంటి అద్భుత రసామృత కావ్యాలను రచించారనీ, ఆ రచనలను సభకు పరిచయం చేసారు. పెద్దిభోట్ల లక్ష్మీనారాయణ, మాట్లాడుతూ తన తండ్రి పేరిట నెలకొల్పిన ఈ పురస్కారాన్ని అప్పాజోస్యుల సత్యనారాయణ వారికి అందించడం తనకెంతో ఆనందదాయకమని అన్నారు. పురస్కార స్వీకర్త అప్పాజోస్యుల సత్యనారాయణ మాట్లాడుతూ, రసధుని అవార్డు అందిస్తున్న కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి, తన రచనలలోని కొన్ని పద్యాలను ఆలపించి సభికులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచి అలరించారు. అనంతరం అప్పాజోస్యుల వారిని ఘనంగా సత్కరించి పురస్కారం అందజేసారు.మామిడిశెట్టి శ్రీనివాసరావు, చల్లా అన్నపూర్ణేశ్వరరావు, కోలాటి పెద్దిరాజు ముఖ్య అతిధుల్ని సభకు పరిచయం చేసారు. వి.వి.యస్.యన్ రాజు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నమట్ల కబర్థి, ముచ్చర్ల వెంకట సత్యనారాయణ, వంగా నరసింహారావు,చేగొండి సత్యనారాయణ మూర్తి, గంటా కళ్యాణి నాయుడు,గడ్డం లక్ష్మీనారాయణ, ర్యాలి విష్ణుమూర్తి, చిప్పాడ వామణమూర్తి, గొర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి, కొట్టి రామం, గుడాల హరిబాబు, బ్యాంక్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.