Skip to main content

Telugu News Power

సూపర్ 6 సూపర్ హిట్ #news #telugu #latestnews #bjp #tdp #jsp

 

https://youtube.com/shorts/H9toz4qj4pQ

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సూపర్ హిట్ అని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సామాన్యులకు గిఫ్ట్ అని యలమంచిలి మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ తగ్గింపు అంశాలపై గడపగడపకు ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం కొంతేరు గ్రామంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు, మాజీ జడ్‌పీటీసీ బోనం నాని, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జ్ ఉన్నమట్ల కపర్థి,తెలుగు దేశం పార్టీ గ్రామ అధ్యక్షులు గంటా శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు బత్తుల రాజు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ దుర్గ, బీజేపీ గ్రామ అధ్యక్షులు సత్తి బాబు పలువురు, కూటమి నాయకులు పాల్గొన్నారు.