Skip to main content

Telugu News Power

ముంచుకొస్తున్నా మన్తా తుఫాన్! #news #latestnews #telugu #palakollu #rain #cyclone

ముంచుకొస్తున్న మంతా తుఫాన్ — అత్యంత తీవ్రత కలిగిన తుఫాను “మంతా” పేరుతో విరుచుకుపడనుంది. ప్రస్తుతం తుఫాన్ ముందర ప్రశాంతత కొనసాగుతోంది. థాయి భాషలో “మంతా” అంటే అందమైన పువ్వు. ప్రకృతి భీభత్స ప్రళయాన్ని సృష్టించే ఈ తుఫానుకు పువ్వు పేరు పెట్టడం కొసమెరుపు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 25న ఏర్పడిన అల్పపీడనం బలపడి, 27 నుంచి 28 మధ్య విధ్వంసం సృష్టించనుంది.

వాతావరణ శాఖ అంచనాల మేరకు, వాయవ్య దిశగా ప్రయాణించి మచిలీపట్నం–కళింగపట్నం మధ్య 28న సాయంత్రం లేదా రాత్రి తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు.

అధికారుల అంచనాల ప్రకారం, ఈ తుఫాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు.

ఈ తుఫాన్ ప్రభావం వల్ల గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని రెవిన్యూ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో తుఫాను ప్రభావం ఉన్న 23 జిల్లాల్లో కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.

ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ రెండు మూడు రోజులకు అవసరమైన నిత్యావసరాలు, ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.