Telugu News Power

స్వదేశీ క్వాంటం కంప్యూటర్లతో ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు

క్వాంటం కంప్యూటర్ తయారీ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి: ఏప్రిల్, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఆంధ్రప్రదేశ్‌లో మొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు: అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు ప్రారంభం. భారత రాష్ట్రాల్లో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ క్వాంటం కంప్యూటర్లు ఆధారితంగా ఏర్పాటు చేయబడ్డాయి. ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమ నాయకులు, అకాడమీక్ వర్గాలు, విద్యార్థులతో కలిసి అమరావతి క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీలు మంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు.
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ‘అమరావతి 1S’ మరియు మేధా టవర్స్‌లో ‘అమరావతి 1క్యూ’గా ఈ ఓపెన్-అక్సెస్ ప్లాట్‌ఫారమ్‌లు ఏర్పడ్డాయి. ఇవి పూర్తిస్థాయి హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్‌లుగా పనిచేస్తాయి.
క్వాంటం కాంపోనెంట్లను వాస్తవ ఆపరేటింగ్ పరిస్థితుల్లో ధృవీకరించడం, బెంచ్‌మార్కింగ్, సర్టిఫికేషన్ చేయడానికి ఏ క్యూ అర్ ఫ్ సహాయపడుతుంది. స్వదేశీ క్వాంటం కంప్యూటర్ల తయారీకి ఇది గొప్ప అడుగు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి, గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీగారి జాతీయ క్వాంటం మిషన్ కు ఇది బలోపేతం చేస్తుంది.
ఇవాళ ఏప్రిల్ 14 డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి, ప్రపంచ క్వాంటం డే. బాబాసాహెబ్ విజన్ ప్రకారం విద్యే విముక్తి సాధనం. ప్రతి భారతీయ విద్యార్థి, పరిశోధకుడు, స్టార్టప్‌కు క్వాంటం కంప్యూటింగ్ అందేలా చేస్తూ ఆయన ఆలోచనలకు సమర్పణ చేశారు.
అకాడమీక్, పరిశ్రమ భాగస్వాములకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు.