Telugu News Power

ఈ ఆనందం మర్చిపోలేనిది మంత్రి నిమ్మల

నా జీవితంలో ఈ ఆనందం మర్చిపోలేనిదని స్థానిక ఎమ్మెల్యే మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు. పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం రాత్రి జరిగిన డీఎస్సీ విజేతలకు అభినందన సభలో మంత్రి మాట్లాడారు. తన తండ్రి నిమ్మల ధర్మారావు పేరుమీద ఏర్పాటుచేసిన ట్రస్ట్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే, అనేక ప్రయాసలు పడి, రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు.నేను సహితం సమిధ నొక్కటి అంటూ ఎందరో ముందు కొచ్చారన్నారు.ఈ మహా యజ్ఞం 600 మంది ఉద్యోగార్థులకు 130 రోజులపాటు నిర్విఘ్నంగా శిక్షణ కొనసాగించామన్నారు. ఉపాధ్యాయులుగా 40మంది రికార్డు స్థాయిలో ఉద్యోగాలు పొందడంతో ఈ క్రతువు దిగ్విజయంగా పరిపూర్ణం అయ్యిందన్నారు.సమున్నత సమాజాన్ని తయారుచేసే శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉందన్నారు. ఇంతటి గురుతరబాధ్యతను త్రికరణ శుద్ధిగా స్వీకరించాలన్నారు. బాధ్యతతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు, రాష్ట్రంలో లక్ష మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కిందన్నారు.పాలకొల్లుకు 40 ఉద్యోగాలు రావడం తో ఇది ఒక అరుదైన అంశం గా మంత్రి పేర్కొన్నారు, డీఎస్పీ పూర్తి చేసి ఉద్యోగాలు పొందడానికి కృషి చేసిన విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ అభినందనీయులన్నారు.వీరు విద్యామంత్రిగా చేపడుతున్న సంస్కరణ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించినవారు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగం వ్యక్తంచేశారు. మంత్రి నిమ్మల తమ జీవితాల్లో వెలుగు నింపిన దేవుడని కీర్తించారు. ఈ సందర్భంగా నూతన ఉపాధ్యాయులను వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. కోచింగ్ ఇచ్చిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ సభలో అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ అధినేత పూర్ణచంద్రరావు పాలకొల్లు ఎంఈఓ గుమ్మాల వీరస్వామి డిఎన్ఆర్, కూటమి నాయకులు కర్నేనీ గౌర్నాయుడు పెశ్చెట్టీ బాబు, గండేటి వెంకటేశ్వరరావు, తులా రామలింగేశ్వర,కొల్లి కొండ ప్రసాద్ గొట్టుముక్కల రాజు, మామిడిశెట్టి పెద్దిరాజు, పాముల రజిని, బోనం నాని జాలి ఈ శ్రీనివాస్ కలిదిండి కృష్ణ వర్మ ,రావూరి వెంకట అప్పారావు, పీతల శ్రీనివాస్, జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు.