Telugu News Power

పాలకొల్లులో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభము

భవిష్యత్తులో ఎందరో కళాకారులను తయారు చేయాలన్న తపనతో పూలపల్లిలో అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నట్టు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ బుధవారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు కళలకు ,కళాకారులకు పుట్టిల్లు అన్నారు .అలనాటి అల్లు రామలింగం,దాసరి నారాయణరావు , రవిరాజ పినీశెట్టి, కోడి రామకృష్ణ ,రేలంగి నరసింహారావు నుంచి నేటి చేగొండి అనంత శ్రీరామ్ వరకు ఎందరో కవులు కళాకారులు ఈ పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను సినిమా రంగంలో ఇనుమడింప చేశారన్నారు. ఈ చిత్ర సంస్థ ద్వారా ఎందరో ఔత్సాహికులైన్ కళాకారులకు అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా మంత్రి పూజాధికాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు. చలనచిత్రాలు చిత్రీకరణకు గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాలు పకృతి రమణీయత ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన ఎంతగానో దోహదపడతాయన్నారు.కార్యక్రమంలో సలహాదారు, మాజీ ఎంపీ, సినీ నిర్మాత చేగొండి వెంకటయ్య హరిరామయ్య మాట్లాడుతూ చిరకాల స్వప్నం నెరవేరి ఫిల్మ్ ఇనిస్ట్యూట్ ప్రారంభమైందన్నారు. రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ తన వంతు సహకారాన్ని ఈ శిక్షణా సంస్థకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడానికి సహకరించిన చేగోండి హరిరామజోగయ్య, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ కోరుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. జనవరి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు .ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గాంధీభగవాన్ రాజు ,కార్యదర్శి డాక్టర్ వర్మ , యాక్సెప్సియోసభ్యులు దర్శకులు రాజ వన్నెంరెడ్డి ,బోనం నరసయ్య, చవ్వాకుల సురేష్ కలిదిండి గణపతిరాజు ,వీరా పోతన ,ప్రదీప్ ఉదయ్ వి. వెంకటరమణ ,గుడాల హరిబాబు ప్రదీప్,బందెల భాస్కరరావు తదితర పలువురు కళాకారులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.