పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెన్నిస్ పోటీల మొదటి ఘట్టం ఆదివారం ముగిసింది. చెరుకూరి బుద్ధ అవతారం రాజు స్మారక టెన్నిస్ పోటీల్లో భాగంగా శని, ఆదివారం లో క్వాలిఫైయింగ్ మ్యాచులు జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 82 మంది క్రీడాకారులు పోటీపడ్డారు. వీరిలో 32 మంది మెయిన్ డ్రాకు చేరుకున్నారు. క్వాలిఫైయింగ్ మ్యాచ్లో 82 మంది 45. 55, 65 ,70 సంవత్సరాల పడిలో పడిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీనియర్ టెన్నిస్ ర్యాంకింగ్ ఉన్న వివిధ రాష్ట్రాలకు చెందిన 72 మంది క్రీడాకారులు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి నరసాపురంలోని రెండు, పాలకొల్లులో రెండు టెన్నిస్ కోర్టులలో ఆడతారని ఆర్గనైజింగ్ సె.క్రటరీ జి.ఎస్.వి.ఆర్.ఎస్.ఎన్ రాజు, బూన్ రాజు విలేకరులకు తెలిపారు. ఈ మ్యాచ్లకు వినుకొండ దినేష్, పి వర్మ, ఎన్ శ్రీనివాసరాజు, పి కిరణ్ ఎంపైర్స్ గా వ్యవహరిస్తారు . మ్యాచ్లకు చీఫ్ రిఫ్రిగా హైదరాబాద్ సంతోష్ వ్యవహరిస్తున్నారు. ఈనెల 10న, సోమవారం టెన్నిస్ పోటీలు ప్రారంభమవుతాయి.
రాష్ట్ర జల వనరుల శాఖామాlత్యుల నిమ్మల రామానాయుడు పోటీలను ప్రారంభిస్తారు. నరసాపురం ఆర్డీవో దాసిరాజు ఇతర ప్రముఖులు పాల్గొంటారు.
