Telugu News Power

దీపోత్సవం- భక్తి పారవశ్యం

పాలకొల్లు: నవంబర్, 17 (తెలుగు న్యూస్ పవర్) కార్తీక మాసం తుది సోమవారం రాత్రి పాలకొల్లులో, కాంగ్రెస్ నాయకులు కరిమేరక బాల నాగేశ్వరరావు స్థలంలో ఏర్పాటుచేసిన కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు నిమ్మల రామానాయుడు, సూర్యకుమారి, ఇర్రింకి దుర్గా హరిహర సాయి పవన్, శ్రీజ పుణ్యదంపతులు, తదితర పెద్దలు జ్యోతి ప్రజ్వలన చేసి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైదిక ఘనపాటీలు దీపోత్స పూజలకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ప్రవచన కర్త నిట్టల ఫణి భాస్కర్, దేవతల వాహనల ఔన్నత్యాన్ని గురించి వివరించారు. వైదిక,శాస్త్రోత్రంగా దీప పూజ నిర్వహించారు. ఈ సమయంలో విద్యుత్ వెలుగు ఆపి, జ్యోతి ప్రజ్వలనతో ఆ ప్రాంతం అంతా దేదీప్య మానంగా, మిరుమిట్లు గొలిపే కాంతుల వెలుగులతో మెరిసి పోయింది. పతాక సన్నివేశంలో ఉర్రూతలూగించే సంగీతం, లైటింగ్ ఎఫెక్ట్స్, సాక్షాత్తు ఆ ఆదిదేవుడే తన ప్రమదిగణాలతో వచ్చి తాండవం చేసినట్టే, అనుభూతి కలిగించారు. హారతులు సమర్పించి దీపోత్సవం సంపూర్ణం చేశారు. దీపోత్సవానికి భక్త మహిళా లోకం వందల సంఖ్యలో వచ్చి,భక్తిపారవశ్యంతో పులకించి పోయారు. చెప్పాలంటే పరమ శివుని పూనకాల లోడింగే అనిపించింది.
పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్, భారతీయ విద్యాభవన్స, మంటిసోరి పాఠశాల,కళాశాల, సౌమ్య హాస్పిటల్స్, టౌన్ హాస్పిటల్స్, ఉమా హాస్పిటల్స్,సాయి మెడికల్ ఏజెన్సీస్, పూజా ఆయిల్స్ సౌజన్యంతో ఈటీవీ వారు ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ రాజశేఖర్, తటవర్తి సుధాకర్,కలిదిండి కృష్ణ వర్మ, రామభద్ర రాజు, సాగిరాజు రాజు, కూటమి నాయకులు కపర్ది, రామ లింగేశ్వర రావు, జీవి, పెశ్చెట్టి బాబు,బొప్పన చిన్నా తదితరలు ఈ ఆధ్యాత్మిక అనుభూతులు పంచుకొన్నారు.