Telugu News Power

పట్టణంలో వైసిపి కోటి సంతకాల పర్యటన

కోటి సంతకాలు కార్యక్రమంలో పాల్గొన్న శంకరాపు శ్రీనివాస్, జోగాడ ఉమామహేశ్వర రావు తదితరులు.
పాలకొల్లు:నవంబర్, 20 (తెలుగు న్యూస్ పవర్) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటుకు సంబంధించి తలపెట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం పాలకొల్లు బంగారు చెరువుగట్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా పత్రాలు చూపించి సంతకాలు సేకరించారు. ఈ పర్యటనలో యలమంచిలి వారు ఇంటింటికి వెళ్లి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో, జగనన్న తెచ్చిన 17 మెడికల్ కాలేజీలకు 5000 కోట్లు కేటాయించడం ఎందుకు వీలు కాద ఆలోచించాలన్నారు.. ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ కళాశాలలో పేద, మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడం వీలుకాదని వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ నాయకులు శంకర శ్రీనివాస్, జోగడ ఉమా మహేశ్వర రావు తదితర నాయకులు పాల్గొన్నారు