యలమంచిలి: నవంబర్,22 (తెలుగు న్యూస్ పవర్)
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన, క్లస్టర్ సమావేశం యలమంచిలి మండలంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈసారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు వేరుగాను, పాఠశాల సహాయక ఉపాధ్యాయులకు వేరుగాను ఈ సమావేశాలు నిర్వహించారు. యలమంచిలి మండలంలో ఉన్న మొత్తం 4 క్లస్టర్లలో ఈ సమావేశాలు జరిగాయి. యమంచిలి లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు క్లస్టర్ తో పాటు, స్కూల్ అసిస్టెంట్స్ క్లస్టర్ సమావేశం కూడా నిర్వహించారు. దాదాపు 300 మంది ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మండల విద్యాశాఖ ,అధికారులు ఏ శ్రీవాణి రామకృష్ణంరాజు ఈ సమావేశాలు పర్యవేక్షించారు. క్లస్టర్ చైర్మన్ సిహెచ్ వి సురేష్ బాబు, ఆర్ సత్యనారాయణ, ఎంవీ సత్యనారాయణ, ఎస్. శ్రీరామచంద్ర మూర్తి ఈ సమావేశాల అధ్యక్షత వహించారు. రాబోయే తల్లిదండ్రుల సమావేశం విజయవంతం చేయడానికి తీసుకోవలసిన యాక్షన్ ప్లాన్ గురించి చర్చించారు. మాదిరి పాఠ్యాంశ బోధన ఆయా సబ్జెక్టుల వారిగా జరిపారు.విద్యార్థుల ప్రగతి గురించి సమీక్షించారు.
