
యలమంచిలి: నవంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) భావితరాల భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మంత్రి మిమ్మల్ని రామానాయుడు పిలుపునిచ్చారు. యలమంచిలి మండల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యలమంచిలిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఈ సభకు నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి చిన్ని స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉండి రాజకీయం కూడా చేయాలని కోరారు. మళ్లీ జగన్ అధికారంలోకి అడుగు పెట్టకుండా చూడాలని కార్యకర్తలకు నిర్దేశం చేశారు. యలమంచిలి మండలం తెలుగుదేశం పార్టీకి ప్రాణం ఇచ్చేవారు ఉన్నారని మంత్రి తెలిపారు. యలమంచిలి ఏటిగట్లకు 18 కోట్లు, నీటిపారుదల సంబంధించి లాకులకు తొమ్మిది కోట్లు కేటాయించమన్నారు. యలమంచిలి కి 70 కోట్ల తో జల జీవన్ మిషన్ ద్వారా రక్షిత మధ్య నీరు సరఫరా ఏర్పాటు చేశామన్నారు. ప్రజల కోసం ముఖ్యమంత్రి నుంచి తన వరకు కూడా రోజు 18 గంటల పైగా పనిచేస్తున్నానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి వివరించారు. అమరావతి, పోలవరం, హంద్రీనీవా 738 కిలోమీటర్ల మేర కృష్ణా జలాలు తీసుకురావడం వంటి పనులు తమ ప్రభుత్వంలో చురుగ్గా సాగుతున్నాయన్నారు. యలమంచిలి సొసైటీ అధ్యక్షులు బొప్పనారికి షో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలు వేధింపులు గురికాకుండా ఆపిన ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక నియోజకవర్గం పాలకొల్లు అన్నారు. అందుకు నిమ్మల రామానాయుడు నాయకత్వ సమర్థత కారణం అన్నారు. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు బాణం నాని మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి నిమ్మల రామానాయుడు పనితీరు ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు.మండల తెలుగుదేశం అధ్యక్షులుగా నూతనంగా నియమితులైన మామిడిశెట్టి పెద్దిరాజు మాట్లాడుతూ తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి నిమ్మల రామానాయుడు తనకు గురువులా రాజకీయాన్ని నేర్పించారన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ నాయకులు, సర్పంచ్ చాంబర్ మాజీ అధ్యక్షులు కడలి గోపాలరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వెనకబడిన వర్గాలకు ఎంతో మేలు చేసిందన్నారు. నీటి సంఘం అధ్యక్షులు మాతా రత్నరాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పదవులు ఇవ్వడంలో,రావడంలో తెలుగుదేశం ముందు ఉంటుందన్నారు. జిల్లా ఎస్సీ సెల్ నాయకులు పీతల శ్రీనివాస్ మాట్లాడుతూ నిమ్మల రామానాయుడు విమర్శించే అర్హత ఎవరికి లేదన్నారు. తెలుగుదేశం నాయకులు నిమ్మల రామానాయుడు లాంటి ఎమ్మెల్యేలు ఎప్పటికీ వదులుకోరాదని, వారికి సేవలకు గుర్తింపుగా కరతాల ధ్వనులతో కృతజ్ఞతలు చెప్పించారు. పెదలంక సర్పంచి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రగతికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు చిట్టూరి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ అరంగ రామ్మోహన్రావు, ఇంచార్జ్ చంద్రమౌళీశ్వరరావు, కర్నేని గౌరునాయుడు ,పెచ్చెట్టి బాబు, గోటుముక్కలు సూర్యనారాయణ రాజు, పెనుమత్స రామభద్రరాజుమాట్లారు. నూతనంగా ఎన్నికైన వివిధ కమిటీలలో నియమితులైన మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తమ్మినీడి శ్రీనివాస్, తెలుగు యువత అధ్యక్షులు బొప్పన రాంబాబు, మండల తెలుగు రైతు చెరుకూరి అంజిబాబు తదితరులచే మంత్రి నిమ్మల ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సభకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారు.