Telugu News Power

75వ రాజ్యాంగ దినోత్సవ వేడుక

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న విద్యార్థి.

పాలకొల్లు: నవంబర్,26 (తెలుగు న్యూస్ పవర్)భారత రాజ్యాంగ 75 దినోత్సవం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమం స్థానిక లజపతిరాయ్ పేట లో గల అంబేద్కర్ భవనం వద్ద నిర్వహించారు. స్థానిక మాంటిసోరి పాఠశాల మరియు జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విద్యాసంస్థల అధినేత కలిదిండి కృష్ణ వర్మ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగ రచన పూర్తి చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తో పాటు కమిటీ సభ్యులు ఎన్నో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారన్నారు. భారత రాజ్యాంగ హక్కులను బాధ్యతలను అందరూ విధిగా పాటించాలని కోరారు.ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు రాజ్యాంగం గురించి మాట్లాడారు. డాక్టర్ పెద్దిరాజు రాజ్యాంగం గురించి తన ప్రసంగంలో వివరించారు.విద్యార్థులు రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిరంజీవి కోలాటి తమన్ బాల అంబేద్కర్ వేషధారణ అందర్నీ ఆకట్టుకుంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ ట్రస్ట్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో, అంబేద్కర్ వాది, రచయిత,డాక్టర్ కోలాటి పెద్దిరాజు, సురదాసి అశోక్ కుమార్, బీర ప్రభాకర్ రావు, తెలుగుదేశం నాయకులు, తోట వెంకటేశ్వరరావు బీర కిరణ్, బీర మధు పాల్గొన్నారు.

రాజ్యాంగ దినోత్సవ సభలో పాల్గొన్న మాంటిసోరి విద్యార్థులు