పాలకొల్లు: నవంబర్,30(తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు వాకర్స్ క్లబ్ జిల్లాస్థాయిలో మూడుఅవార్డులు సొంతం చేసుకుంది. క్లబ్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు ప్రకటించారు. బెస్ట్ క్లబ్, బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రెటరీ అవార్డులు, సొంతం చేసుకున్నారు.. భీమవరం కాస్మో క్లబ్ లో ఆదివారం జరిగిన వాకర్స్ జిల్లా 201 కాన్ఫరెన్స్ లో ఈ పురస్కారాలు అందజేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి,డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటూరు రామరాజు అవార్డులను అందజేశారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు,కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్ అవార్డులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ గవర్నర్ ఆకి రామకృష్ణ జీవి సుబ్బారావు సభ్యులు కాగిత సూర్యనారాయణ, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పాలకొల్లు వాకర్స్ క్లబ్ కు మూడు అవార్డులు
ప్రెసిడెంట్ అవార్డు స్వీకరిస్తున్న తటవర్తి సుధాకర్