Skip to main content

Telugu News Power

వైసీపీ నేతలకు సిఐడి నోటీసులు

వైసీపీ నాయకులు ఉచ్చుల స్టాలిన్ బాబు.

యలమంచిలి:డిసెంబర్,2 (తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి మండలం వైసిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు మంగళవారం సిఐడి నోటీసులు అందుకున్నట్టు వెల్లడించారు. టిడ్కో ఇల్లు పంపిణీ సభ సందర్భంగా, 2022 లో జరిగిన ఘర్షణకు సంబంధించి ఈ నోటీసులు అందుకున్నామన్నారు. అప్పటి శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ప్రోటోకాల్ పాటించకపోవడం,తనపై దాడి చేశారని పలువురు వైసిపి నాయకులు పై కేసు పెట్టారని తెలిపారు. ఇది తనపై టిడిపి పార్టీ వారు పెట్టిన ఐదో కేసుగా ఆయన వివరించారు. వైసిపి సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు తో పాటు మరో ముగ్గురు కూడా ఈ నోటీసులు అనుకున్నారన్నారు. ఈనెల 11న రాజమండ్రి సిఐడి ఆఫీసుకు హాజరు కావలసిందిగా నోటీసులో పేర్కొన్నారన్నారు.