Telugu News Power

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు

ప్రశంసా పత్రాలతో విద్యార్థులు

యమంచిలి:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలంలోని అడవిపాలెం గ్రామంలో అద్దెపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థుల,ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీపీ పాఠశాల వద్ద విద్యార్థులకు సాంస్కృతిగా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, ప్రతిభ మెరుగుపరుచుకోవచ్చు అన్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంపులో సేవాభావంతో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపల్ అభినందించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు సర్టిఫికెట్లు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెరుకూరి అంజి బాబు అందజేశారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ కోఆర్డినేటర్ భద్రాచలం ప్రోగ్రామ్ ఆఫీసర్లు రాధాకృష్ణ రామకృష్ణ డాక్టర్ వి విజయలక్ష్మి తెలుగు విభాగాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి, కమిటీ మెంబర్లు వాలంటీర్లు, పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు,స్థానికులు పాల్గొన్నారు.