Telugu News Power

కృష్ణ తేజ అద్భుత చెస్ ప్రదర్శన

పాలకొల్లు డిసెంబర్ 6 తెలుగు న్యూస్ పవర్ అంతర్జాతీయ చదరంగా క్రీడ ఛాంపియన్ శనివారం చదరంగం లో అద్భుతాన్ని ప్రదర్శించారు. కృష్ణ తేజ ఒకేసారి 55 మందితో చదరంగం ఆడి అద్భుతాన్ని ఆవిష్కరించారు. స్థానిక యూరో కిడ్స్ పాఠశాల ఇందుకు వేదిక అయింది. ఈ సందర్భంగా కృష్ణ తేజ మాట్లాడుతూ, చెస్ ఆడటం వల్ల మేదస్సు వికసిస్తుందన్నారు. ఇది విద్యార్థుల ధారణకుఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణ తేజను అభినందించారు. విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపీకలు,అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గుమ్మల్ల వీరస్వామి,జిల్లా చెస్ అధ్యక్షుడు, మాదాసు కిషోర్, కృష్ణ తేజ తండ్రి వెంకయ్య, సంస్థ డైరెక్టర్ రాజేష్, ప్రిన్సిపల్ ప్రతిమ పాల్గొన్నారు.