Telugu News Power

అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి.

గాంధీ బొమ్మల సెంటర్లో అంబేద్కర్ కు నివాళులర్పిస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు డిసెంబర్ 6 తెలుగు న్యూస్ పవర్ అంబేద్కర్ ఆశయాల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఆ మేరకు చంద్రబాబు నాయుడు గతంలో భారత దేశ అత్యున్నత పదవి పార్లమెంటు స్పీకర్గా జిఎంసి బాలయోగి రాష్ట్ర స్పీకర్గా ప్రతిభాపాతిని ఎంపిక చేసి సౌండ్ సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న అంబేద్కర్ నివేద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ భవన వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మంత్రి స్వయంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.