Telugu News Power

అభివృద్ధి పనులు పరుగులు పెట్టాలి అధికారులుకు మంత్రి నిమ్మల ఆదేశాలు.

పాలకొల్లు:డిసెంబర్, 7 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు పరుగులు పెట్టించాలని మంత్రి నిమ్మల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల సమీక్ష లో టిడ్కో ఇళ్ళు,మున్సిపల్, టూరిజం,పంచాయతీరాజ్, జలవనరులు, ప్రజాఆరోగ్య శాఖలతో మంత్రి సమీక్ష సమావేశం లో దిశా నిర్దేశం చేశారు. పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పనులు విషయంలో ముందు వరుసలో నిలపాలని అధికారులకు సూచించారు. టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేయడానికి త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. గౌడ, శెట్టిబలిజ సంఘ కళ్యాణమండపభవనం, రామగుండం పార్క్, ఎన్టీఆర్ కళాక్షేత్రం, అబ్దుల్ కలాం పార్క్, ముస్లిం షాది ఖానా, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.