Telugu News Power

కాస్మో క్లబ్ సాయం, క్యాన్సర్ బాధితునికి ఉపశమనం.

ఆర్థిక సహాయం అందిస్తున్న కాస్మో క్లబ్ ప్రతినిధులు

పాలకొల్లు, యలమంచిలి :డిసెంబర్,8 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు కాస్మో క్లబ్ యలమంచిలి మండలం, ఏనుగువానిలంక శివారు,పోలవరానికి చెందిన పోత్తూరు నరసింహారాజు నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇందువల్ల వీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాస్మో క్లబ్ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వీరికి సహాయం చేయడానికి పూనుకున్నారు. వీరి ఆలోచన మేరక, క్లబ్ కార్యదర్శి వేగిరాజు వెంకట సోమరాజుగారు క్లబ్బు నిధుల నుంచి 20వేల రూపాయలు కేటాయించారు. క్షత్రియ పరిషత్ తరపున అధ్యక్షులు చెరుకూరు సూరిబాబు, కార్యదర్శి డాక్టర్ వర్మ 10 వేల రూపాయలు సమకూర్చారు. జున్నూరు గ్రామానికి చెందిన ప్రముఖ రైస్ మిల్లర్ పెనుమత్స రామచంద్ర రాజు 10 వేల రూపాయలు సహాయం అందించారు. ఈ మొత్తం 40వేల రూపాయలు బాధితుని కుమార్తె లక్ష్మి, అల్లుడు ముదునూరి శ్రీనివాసరాజు క్లబ్ వేదికపై సహాయాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ కన్వీనర్ పెనుమత్స బుద్ధరాజు, క్షత్రియ పరిషత్ ఈసీ సభ్యులు పోత్తూరీ వరప్రసాద్ రాజు, క్లబ్ ఈసి సభ్యులు కలిదిండి గణపతి రాజు, అల్లూరి తిమ్మరాజు పాల్గొన్నారు. దాతలు సహాయానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.