సఖినేటిపల్లి: డిసెంబర్,10 (తెలుగు న్యూస్ పవర్) నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన ప్రసిద్ధ అంతర్వేది నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో బుధవారం సుదర్శన నరసింహ హోమం జరిగింది. ఈ హోమం చేయించుకుంటే,స్వామి వారి కంటే వేగంగా భక్తులను చేరుకునే సుదర్శన చక్రం, సకల ఈతి బాధలకు విముక్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల యొక్క సత్ప్రవర్తనకు, ప్రశాంతతకు ఈ హోమం దోహదపడుతుందని పండితులు తెలిపారు. స్వామివారి ఆలయం చుట్టూ 9 సార్లు,9 వారములు ప్రదక్షిణలు చేసిన భక్తులు ఈ హోమంలో పాల్గొంటారు. పండితులు రమేష్,రంగాచారి సీతారాం ఈ హోమ క్రతు నిర్వహించారు. పలువురు భర్త దంపతులు ఈ ఈ హోమంలో పూజ ద్రవ్యాలు వేసి సంపూర్ణ చేశారు.
అంతర్వేది లో సుదర్శన నరసింహ హోమం