యలమంచిలి: డిసెంబర్,14(తెలుగు న్యూస్ పవర్)
అభివృద్దే,ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నది, కూటమి ప్రభుత్వమని, స్థానిక శాసన సభ్యులు,రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఏటిగట్టు పటిష్ట పరిచే పనుల శంకుస్థాపన కార్యక్రమంలో చించినాడ వద్ద మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూనియోజకవర్గంలో దాదాపు 20 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్లు పటిష్టత కోసం గతంలో 8 కోట్ల, రూపాయల నిధులు మంజూరు చేయించామని, ప్రస్తుతం దాదాపు మరో 9 కోట్లు తో 17 కోట్ల రూపాయల
నిధులతో దాదాపు 20 కిలోమీటర్ల ఏటిగట్టు పటిష్ట పరుస్తున్నామని మంత్రి నిమ్మల వెల్లడించారు. ఏటిగట్టు రక్షణ వల్ల ప్రజలకు భద్రత ఉంటుందన్నారు. గత 22లో వచ్చిన వరదలకు అప్పటి మంత్రులు వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఏమి చేయలేదని ఆరోపించారు. స్థానిక యువత రేయింబవళ్లు కష్టపడి వరదల ఉపద్రవాన్ని నివారించగలిగారన్నారు. చించినాడ లో ఉన్న దళితుల భూములు లాక్కొని వారి పొట్ట కొట్టి,మట్టి అమ్ముకున్నారని వైసిపి నాయకులను మంత్రి దుయ్యబట్టారు. దళితుల తరఫున నిలబడి, కేసులతో వేధింపులు ఎదుర్కొన్నా మన్నారు. ఆ భూములకు విముక్తి కలిగించి మౌలిక సదుపాయాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. ఈ విధంగా అంబేద్కర్ నిజమైన వారసులు కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు మామిడిచెట్టి పెద్దిరాజు, ఉపాధ్యక్షులు, తమ్మినీడి వెంకట సత్య శ్రీనివాస్,కడలి గోపి, సొసైటీ అధ్యక్షులు,బొప్పన హరి కిషోర్, బోనం నాని, తెలుగు రైతు చెరుకూరి అంజి బాబు,చిలుకూరి శ్రీనివాస్,, బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది, జనసేన నాయకులు కొడవటిదొరబాబు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, ఆరమిల్లి చిన్ని పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం
చించినాడ వద్ద ఏటిగట్టు పనుల శంకుస్థాపన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు