Telugu News Power

పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

పంచాయతీ భవన శంకుస్థాపన సభలో మంత్రి నిమ్మల మాజీ ఎమ్మెల్సీ అంగర.

పాలకొల్లు:డిసెంబర్,14 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర జలవనరుల శాఖమాత్యులు, స్థానిక శాసనసభ్యులు రామానాయుడు వడ్లవానిపాలెం గ్రామంలో 32 లక్షల ఆర్ జి ఎస్ ఏ నిధులతో చేపట్టనున్న పంచాయితీ భవన నిర్మాణ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. స్థానిక పెచ్చెట్టిపాలెం లో 15 లక్షల ఓ ఎన్ జి సి నిధులతో స్మశానవాటిక అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఉన్నమట్ల కపర్ది, జనసేన నాయకులు తులా రామలింగేశ్వర రావు, టిడిపి మండల అధ్యక్షుడు పాముల రజిని కుమార్ పలువురు కూటమి నాయకులు,స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.