పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) పశ్చిమగోదావరి జిల్లాకు కొత్తగా 200 పింఛన్లు మంజూరు కానున్నాయి. ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో వచ్చిన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం ప్రకటించారు. ఇందువల్ల పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న అర్హులైన, క్యాన్సర్ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స తీసుకుంటున్న వారు, దివ్యాంగులకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ పింఛన్లు మంజూరు చేస్తారు. ఈ పింఛన్లు బాధితులకు సత్వరమే అందించడానికి నిబంధన సడలించారు. దీని ప్రకారం జిల్లా ఇన్చార్జి మంత్రి,, కలెక్టర్ వారి విచక్షణాధికారం మేరకు వెంటనే పింఛను మంజూరు చేసి బాధితులను ఆదుకోవడానికి అవకాశం కల్పించారు. క్షేత్రస్థాయిలో పరిష్కరించవలసి ఉన్న పెన్షన్లు వెంటనే మంజూరు చేస్తారు.
జిల్లాకు 200 కొత్త పింఛన్లు
పింఛన్ కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులు.