Telugu News Power

వైయస్సార్ పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

పాలకొల్లు వైసిపి కార్యాలయం వద్దమాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు రక్తదాన శిబిరం

పాలకొల్లు:డిసెంబర్,21 (తెలుగు న్యూస్ పవర్) వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు పాలకొల్లు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి తన కార్యాలయం వద్ద స్వయంగా రక్తదానం చేసి, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 80 మంది రక్తదానం చేసినట్టు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వందల మంది అభిమానులు, మహిళా నాయకురాళ్ళు, కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, ఎలమంచిలి ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, ఎడ్ల తాతాజీ, చిలువూరు కుమార దత్తాత్రేయ వర్మ, చేగోండి సూర్యప్రకాష్, నడపన గోవిందరాజులు నాయుడు, డిటిడిసి బాబు, జోగాడ ఉమామహేశ్వరరావు, కళ్యాణం శ్రీనివాస్, ఉచ్చుల స్టాలిన్ బాబు, తదితర నాయకులు పలువురు అభిమానులు పాల్గొన్నారు.

ఎలమంచిలి ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ ఆధ్వర్యంలో జగన్ రెడ్డి పుట్టినరోజు వేడుక