Telugu News Power

తెలుగుదేశం,వైసిపి పార్టీల మధ్య మాటల యుద్ధం.

పాలకొల్లు:డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గంలో బలమైన రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా, నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల హరి గోపాలరావు,గోపి చేసిన వ్యాఖ్యలపై ఈ వివాదం రాజుకుంది. వెంటనే తెలుగుదేశం నాయకులు ప్రతిదాడికి దిగారు. సూపర్ సిక్స్ చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని టిడిపి నాయకులు చెబుతున్నారు. నిరుద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ, పోలీస్ నియామకాలు జరిపామన్నారు. అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. స్థానిక వైద్య కళాశాల అందుబాటులో లేని మూల ప్రాంతంలో ఏర్పాటు చేశారని, నాయకులు దీనివల్ల లబ్ధి పొందారని ఆరోపించారు. పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి పెచ్చెట్టి బాబు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, మండల తెలుగుదేశం అధ్యక్షులు పాముల రజిని కుమార్, మామిడిచెట్టి పెద్దిరాజు గోపి ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. ఎలమంచిలి మండల వైఎస్ఆర్సిపి పార్టీ యలమంచిలి మండల అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు మంగళవారం టిడిపి వారు చేస్తున్న ఆరోపణలు ఖండించారు. గుడాల గోపి వలసపక్షని విమర్శిస్తున్నవారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడ ఆ కోవకే చెందుతారని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగడం మంచిది కాదనీ హితవు పలికారు. తాము చేసిన సంక్షేమ, అభివృద్ధి, సరిగా చెప్పుకోలేకపోయామన్నారు. తమకు కూడా 40 శాతం ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. వైద్య కళాశాల ప్రైవేటుపరం కాకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా ఎలమంచిలి మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఉచ్చుల స్టాలిన్ బాబు,పాలకొల్లు పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, పోడూరు మండల అధ్యక్షులు సాంబశివరావు తదితరులు మాట్లాడారు.