Skip to main content

Telugu News Power

అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు.

శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నిమ్మల

పాలకొల్లు:డిసెంబర్,24(తెలుగు న్యూస్ పవర్) చిన్న గ్రామాలపై కూడా, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.స్థానిక బల్లిపాడు గ్రామంలో 88.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న, అభివృద్ధి పనులకు బుధవారం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. తాగునీటి సరఫరాకు 68.80 లక్షలతో ప్రారంభం కానున్న పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటుకు ప్రారంభం కానున్న 20 లక్షలు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్థి,బీజేపీ, తులా రామలింగేశ్వర రావు జనసేన,సర్పంచ్ ఇందిరా దేవి, పాముల రజినికుమార్, ఎర్రం శెట్టి పద్మారావు, పడమట మావుళ్ళు, కే అయ్యప్ప నాయుడు, తహసిల్దార్ వై.దుర్గాకిషోర్, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, , ఈ ఓ పి ఆర్ డి పద్మారావు, గ్రామ కార్యదర్శి భవాని, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.