Skip to main content

Telugu News Power

భీమవరం కొత్త డిఎస్పీగా రఘువీర్ విష్ణు, -దసరా నుంచి సంక్రాంతి వరకు నడిచిన ఆకస్మిక బదిలీ కథ.

భీమవరం నూతన డిఎస్పి రఘువీర్

భీమవరం: డిసెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) క్రిస్మస్ పర్వదినం రోజున, జిల్లా కేంద్రం భీమవరంలో ఒక పెద్ద కుదుపు సంభవించింది. అకస్మాత్తుగా, సెలవు రోజు ఈ భారీ పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా రఘువీర్ విష్ణు భీమవరం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇది మామూలు బదిలీ అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, తెర వెనుక చాలా కథ నడిచిందని, జిల్లా ప్రజలకు తెలిసిందే. పూర్వ డిఎస్పి ఆర్ జి జై సూర్య పై జనసేన వర్గాలు, తమ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశాయి. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారికి కొమ్ము కాయడం, పోలీసులకు సంబంధం లేని సివిల్ విషయాల్లో తలదూర్చడం వంటి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆ ఫిర్యాదులు సవివరంగా పేర్కొన్నారు. నిజానిజాలు తేల్చాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాఎస్పీ నీ ఆదేశించారు. ఈ సందర్భంగా రామాయణంలో పిడకల వేట చందంగా, కొన్ని అనవసర పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, వ్యంగ్య ధోరణిలో, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పరిధి దాటి జోక్యం చేసుకుంటున్నారని చేసిన వెటకారం, రాజకీయ,రాచపుండు పై కారం చల్లినట్టు ఉందని జిల్లా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ మాటకొస్తే రఘురామ మాజీ డి.ఎస్.పి జై సూర్య కు బుద్ధిమంతుడనే సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. ఒకప్పటి,నరసాపురం పార్లమెంట్ సభ్యులు, రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే. భీమవరంలో పులపర్తి ఆంజనేయులు, జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరి నియోజకవర్గం పరిధిలో రఘురామ మాట్లాడడం సబబు కాదని, నాడు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడిచింది. ఈ సంఘటన వల్ల పవన్ కళ్యాణ్ అధికార పరిధి పరిమితం అని చెప్పే ప్రయత్నం జరిగింది. అందుకు తగ్గట్టుగానే, దాదాపు దసరా పండుగ కు ప్రారంభమైన వివాదం నేటి వరకు కొనసాగుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఏమి ప్రభావం చూపలేకపోయారని ప్రజల్లో అభిప్రాయం కలిగించే ప్రయత్నం జరిగింది. పవన్ కు కులముద్ర వేయాలని, అవకాశం ఉన్నప్పుడల్లా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇచ్చిన బదిలీ ఆదేశాలలో, కాపు కులస్తుడైన,తాజామాజీ డి.ఎస్.పి జై సూర్య కు ఎక్కడ పోస్టింగ్ కూడా లభించినట్టు కూడా లేదు. రాజకీయ వర్గాల్లో
జై సూర్య కులాన్ని బట్టి చర్యలు ఉండవని ప్రచారం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తాను అవినీతికి కాపు కాసే వాడిని కాదని, అందరి వాడినని ఈ సంఘటన ద్వారా మరోసారి ఆచరణాత్మకంగా నిరూపించుకున్నారు. రాష్ట్రంలో తన అధికార పరిధి ఏపాటిదో మాటల్లో కాక చేతల్లో చూపించారని చర్చ జరుగుతున్నది. రాబోయే సంక్రాంతి సందర్భంగా విచ్చలవిడిగా జరిగే సంఘ వ్యతిరేక కార్యకలాపాలు నిరోధించడానికి, కీలు బొమ్మ , అవినీతి అధికారులకు స్థానం లేకుండా చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యపట్ల ప్రజల అభినందనలు తెలుపుకుంటున్నాను.

తాజా మాజీ డిఎస్పి జై సూర్య