Telugu News Power

పాలకొల్లు లో సినిమా షూటింగ్

సురభి భావి నిర్మాతలు

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక పశువుల ఆసుపత్రి వద్ద శుక్రవారం హరి గాడి ‘ హరికథ’ సినిమా దృశ్యాలు చిత్రీకరించారు. సురభి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై, సురభి హరినాధరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వారి మొదటి చిత్రం. దర్శకులు వైవి సర్వేష్ మొదటిసారి పెద్ద తెర సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు చేసిన వెబ్ సిరీస్ మంచి ప్రజాదరణ పొందడంతో ఈ సినిమా అవకాశాన్ని అందుపుచ్చుకున్నారు. హీరోగా హరి యడ్లపల్లి ఈ సినిమా ద్వారా కథానాయకుడుగా పరిచయమవుతున్నారు. కథానాయకి ప్రియ హెగ్డే కన్నడ నటి. హీరోయిన్ గా తెలుగులో నటిస్తున్న మొదటి చిత్రం. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కె. ప్రవీణ్ రెడ్డి. పల్లెటూరు నుంచి పట్నం వరకు సాగే ప్రేమ కథ చిత్రం నేపథ్యంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి,హెచ్.ఆర్ కు మధ్య నడిచే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ కథ నడుస్తుంది. ఆదివారం వరకు ఈ షూటిగ్ పాలకొల్లు, చించినాడ, పేరుపాలెం ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పటికీ ఈ చిత్రం సగభాగం పూర్తయింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పూర్తి అవుతుంది. ఈ చిత్రం వేసవి నాటికి విడుదల అవుతుంది.
పాలకొల్లువాసి, ప్రముఖ కళాదర్శకుల వారసులు అడ్డాల పెద్దిరాజు, జనసేన నాయకులు, కనకదుర్గమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు తో కలిసి ఈ చిత్ర విశేషాలు విలేకరులకు వివరించారు. ఈ చిత్రంలో పాడి పశువులు, మేకలు, కోళ్లు నటించడం విశేషం. యలమంచిలి మండలం శిరగాలపల్లిలో పంట పొలాల్లో చిత్రీకరణ చేశారు.

హీరో హరి, హీరోయిన్ ప్రియ హెగ్డే