Telugu News Power

రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఓ విలన్ – మంత్రి నిమ్మల ఆరోపణ

ఆసుపత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల.

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పేపర్) రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఓ విలన్ల మారారని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. స్థానిక వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి, సుందరీకరణ పనులకు శుక్రవారం కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందుకుగాను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కోటిన్నర రూపాయలు మంజూరు చేయించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినిమాల్లో ప్రతినాయకుడు పాత్రలాగే, జగన్ కథ కూడా త్వరలోనే ముగుస్తుందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ఐదు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఇప్పటి ఆసుపత్రి కంటే,భారీగా, 22 కోట్లతో మరో ఆసుపత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసం దాతలను,సి ఎస్ ఆర్ నిధులు తేవడానికి అనేకమార్గాలలో కృషిచేసి అభివృద్ధికి పాటుపడుతున్న, తమపై బురద చల్లడం సరికాదన్నారు. అది పాలకొల్లు అభివృద్ధికి విఘాతం అవుతుందన్నారు. ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి, సుందరీకరణ, ల్యాండ్ స్కేపింగ్ కు సంబంధించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, ఇంజనీరింగ్ అధికారులు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, తెలుగుదేశం అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, మామిడిశెట్టి పెద్దిరాజు, కుమార్, ఉన్నమట్ల కపర్ది, తులా రామలింగేశ్వరరావు, పెచ్చెట్టి బాబు, ఆసుపత్రి కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.