Telugu News Power

ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు

ఛాంబర్స్ కాలేజీ,సంక్రాంతి సంబరాల్లో ప్రముఖులు

పాలకొల్లు: జనవరి,9(తెలుగు న్యూస్ పవర్) సంక్రాంతి పండుగ సందర్భంగా, పాలకొల్లు నియోజకవర్గం, ఏ మూల చూసినా సాంప్రదాయ శోభతో కళకళలాడింది. సంక్రాంతి సెలవుల సందర్భంగా విద్యాసంస్థలు, చివరి రోజు అన్ని పాఠశాలలో,కళాశాలలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఛాంబర్స్ కళాశాలలో చైర్మన్ కారుమూరి నరసింహ రావు భోగిమంట, వెలిగించి, సంబరాల ప్రారంభించారు. గరగనృత్యాలు, గంగిరెద్దులు, బొమ్మల కొలువులు, గాంధీ జీవిత చరిత్ర ప్రదర్శన, నాణేల ప్రదర్శన వంటి ప్రదర్శనలతో, చూసిన వారి అందరిలో ఆనందం వెల్లివిరిసింది. విద్యార్థులు సుజానాత్మకంగా నమూనా గ్రామాన్ని సృష్టించారు. ముగ్గులు వేసి, మామిడి తోరణాలు కట్టారు. విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తటవర్తి కృష్ణమూర్తి, రేపాక ప్రవీణ్ భాను, దేవరపు లక్ష్మీనారాయణ, కటారి నాగేంద్ర కుమార్, డాక్టర్ వర్మ, నెలకుర్తి సత్యనారాయణ, జయప్రకాశ్ నారాయణ, డాక్టర్ మూర్తి, డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎన్ సీతారామారావు, కే బాబ్జి, ఎన్ రవికుమార్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

గరగ నృత్యాలు

స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం జరిగాయి. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి సంబరాలు ప్రారంభించారు. సాంప్రదా య వస్త్రధారణ పోటీ నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ వింజమూరు శ్రీనివాసరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డాక్టర్ ఎస్ వి రంగారావు, కారుమూరి రామలింగేశ్వరరావు, అద్దెపల్లి మోహన్, కొమ్ములు మురళి, గాది సుబ్బారావు, కాలేజీ అధ్యాపకులు, వెంకటస్వామి, విజయలక్ష్మి, ఆశ జ్యోతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎంవి బాలికల పాఠశాలలో గొబ్బెమ్మల వద్ద కోలాట భజన

స్థానిక బి.వి.ఆర్.ఎం మున్సిపల్. బాలికల హై స్కూల్ సంక్రాంతి సంబరాలు చూపరులను ఆకట్టుకున్నాయి. బాలికలు సాంప్రదాయ వస్త్రధారులతో కార్యక్రమాలు భోగి మంటలు, గొబ్బెమ్మలు,కోలాటం భజన వంటి వివిధ సాంప్రదాయ ప్రదర్శనలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో సంక్రాంతి పొంగలి