పోడూరు:జనవరి,11(తెలుగు న్యూస్ పవర్) మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తిని ప్రోత్సహించడమే మంత్రి నిమ్మల రామానాయుడు లక్ష్యమని, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు పేర్కొన్నారు. పాలకొల్లు నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న ముగ్గుల పోటీలు సోమవారం, స్థానిక జున్నూరులో జరిగాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు ముందు తరాలకు అందించాలని, మంత్రి రామానాయుడు ఆశయం మేరకు ఈ పోటీలు తలపెట్టారన్నారు.ఈ సందర్భంగా సొసైటీ మాజీ అధ్యక్షులు, పాలవలస తుల
సిరావు మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచాలని, అందుకోసం వారిని ప్రోత్సహించడానికి, ధర్మారావు ఫౌండేషన్ ద్వారా,ఈ ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొమ్మేటి శ్రీనివాస్, ఏఎంసి వైస్ చైర్మన్, దాసరి రత్నం రాజు, గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, దేవళ్ళ ప్రసాద్, శీలం శ్రీనివాసరావు, మేడిశెట్టి బుజ్జి, కోటి మోహన్, చొప్పల శ్రీనివాస్, సంకు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.