పాలకొల్లు: జనవరి,18(తెలుగు న్యూస్ పవర్) ఎన్టీఆర్ అంటే ఓ చరిత్రని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల
శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా, స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తర్వాత అనేంత మార్పు తీసుకువచ్చిన మహనీయుడని జోహార్లు అర్పించారు. తెలుగుజాతి ఖ్యాతి ప్రపంచం నలుమూలల ఎన్టీఆర్ వల్ల విస్తరించిదన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి, రాజకీయ పార్టీలు సేవాభావంతో పనిచేయాలని, మార్గదర్శనం చేశారన్నారు. తెలుగుజాతి ఉన్నంతకాలం ఎన్టీఆ
ర్ ప్రజల హృదయాల్లో ఉంటారన్నారు. తెలుగువారు ఉన్నంతకాలం, తెలుగుదేశం పార్టీ నిలిచి ఉంటుందన్నారు. అనంతరం పాలకొల్లు కమ్యూనిటీ ఆసుపత్రి వద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులను పరామర్శించి వారికి పళ్ళు బ్రెడ్ అందజేశారు. రక్తదానం చేసిన వారిని ప్రతి ఒక్కరిని కలిసి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, కర్నేని రోజా రమణి గౌర్నాయుడు, గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, బొప్పన హరి కిషోర్, కూటమి నాయకులు ఉన్నమట్ల కపర్ది, తులా రామలింగేశ్వరరావు, చినమిల్లి గణపతిరావు, పీతల శ్రీనివాస్, కడలి గోపి, మాత రత్నరాజు, పెండ్యాల భవాని తదితరులు పాల్గొన్నారు.
