Telugu News Power

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణం.

స్వామివారి పుష్ప ఉత్సవ దృశ్యాలు

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరిగాయి. పవళింపు సేవతో మంగళవారం రాత్రి కి సంపూర్ణం అయ్యాయి. అర్చక స్వాములు స్వామివారికి పుష్ప ఉత్సవం చేశారు. అంతరాలయంలో స్వామి వారిని, అమ్మవారిని కొలువు తీర్చి, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. తిరుమంజనములు, ద్వాదశ తిరువారాధన, దర్పణసేవ, ధూప సేవ జరిగింది. ప్రత్యేక పూలతో అలంకరించిన ఏకాంత పవళింపు మందిరంలో స్వామివారిని, అమ్మవారిని ఉంచి, చెంగోలు విన్నపం, తీర్థ గోష్టి, పవళింపు సేవ అర్చకులు నిర్వహించారు.
వేలాది మంది భక్తులు స్వామివారి వేడుకలు చూసి తరించారు. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు వివిధ సంఘాల వారు అన్న ప్రసాద వితరణ చేశారు. రోడ్లు విశాలం చేయటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయాయి. ఆర్టీసీ బస్సు ప్రయాణం భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేశారు. వేల మందికి ఉపాధి దొరికింది. లక్షల్లో వ్యాపారాలు సాగాయి. భక్తులు దేశ విదేశాల నుంచి ఈ వేడుక కు హాజరయ్యారు. రక్షిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యులు దేవ వరప్రసాద్, ఎంపీ హరీష్ మాధూర్, కూటమి నాయకులు, అధికారులు, భక్తుల కోణంలో పర్యవేక్షించారు.