Telugu News Power

హత్యకు దారి తీసిన స్నేహితులు మధ్య ఘర్షణ. -విలేకరుల సమావేశంలో వెల్లడించిన డి.ఎస్.పి శ్రీ వేద

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డిఎస్పి శ్రీ వేద

పాలకొల్లు: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) జున్నూరుకు చెందిన ముగ్గురుస్నేహితులు గత నెల 25న అధికంగా మద్యం సేవించడం వల్ల ఘర్షణ సంభవించింది అన్నారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో హత్య గురించి వివరాలు వెల్లడించారు. గత నెల 26న యువకుడు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు విచారణ చేపట్టారు. పోడూరు మండలం జున్నురుకు చెందిన జక్కంపూడి నాగ సాయి కిషోర్, తంగేళ్ల వెంకటేశ్వరరావు లను విచారించారు. వీరు తమను కొట్టాడనే నెపంతో ముప్పర్తి జై సోల్ అనే మరో స్నేహితుడిని గత నెల 26న చించినాడ వద్ద గల గోదావరి వంతెన పైనుంచి తోసేసి, అతని మృతికి కారణమయ్యారు. సాంకేతిక అంశాలు, సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన మీదట పోలీసు వారు నిందితులను గుర్తించారు. మృతదేహం గత నెల 30న దొరికింది. నిందితులను సోమవారం అరెస్టు చేశారు. నిందితులను మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరుస్తామని డిఎస్పి శ్రీ వేద తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా విచారణ చేసి, నిందితులను అతి తక్కువ కాలంలో అరెస్టు చేసినందుకు, స్థానిక సీఐ రజిని కుమార్, పట్టణ ఎస్ఐ పృథ్వి, కానిస్టేబుల్ లను డి.ఎస్.పి శ్రీ వేద అభినందించారు.