అమరావతి: ఫిబ్రవరి, 6(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రంలోని అన్ని ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి 12 తర్వాత 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పాఠ్యాంశాల బోధన ప్రారంభిస్తారు. ఈ మేరకు శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారుల మధ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విద్యాసంబంధ విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో చర్చలు ఫలించి, తొమ్మిదో తరగతి విద్యార్థులకు, మార్చి 12 నుంచి 10వ తరగతి పాఠాలు నేర్పించడానికి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నో బ్యాగ్ డే రోజు పుస్తకాలు లేని పాఠ్యాంశాలు బోధించవచ్చునన్నారు. ఈ ఏడాది బదిలీలు గతం కంటే అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ఉపాధ్యాయ సంఘాలకు అధికారులు హామీ ఇచ్చారు.కొత్త సిలబస్ పై వచ్చే విద్యా సంవత్సరం జూన్లో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు, పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ సుబ్బారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, జాయింట్ డైరెక్టర్లు అబ్రహం, శైలజ పాల్గొన్నారు.
9వ తరగతికి,మార్చి 12 నుంచి పదవ తరగతి పాఠాలు.